Kommareddy Pattabhiram: ఫొటోలతో మోసం చేయకండి
ABN , Publish Date - Jan 03 , 2026 | 05:57 AM
స్వచ్ఛాంధ్ర విజన్-2047లో భాగంగా రాష్ట్రంలో పారిశుఽధ్యంపై అన్నివర్గాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహించే...
‘స్వచ్ఛాంధ్ర ఏజెన్సీ’లపై పట్టాభి అసంతృప్తి
విజయవాడ, జనవరి 2(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛాంధ్ర విజన్-2047లో భాగంగా రాష్ట్రంలో పారిశుధ్యంపై అన్నివర్గాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహించే ఏజెన్సీల పనితీరుపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలోని తన కార్యాలయంలోని శుక్రవారం ఏఐఐఎల్‌ఎ్‌సజీ(ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్), వాష్ ఇన్‌స్టిట్యూట్ ఏజెన్సీలతో వేరువేరుగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలను సమీక్షించారు. నాలుగు నెలల శిక్షణా కార్యక్రమాలపై కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. కేవలం ఫొటో కార్యక్రమాల ద్వారా ఎవరిని వారు మోసం చేసుకోవద్దని హితవు పలికారు. కార్యక్రమం కోసం రూ.కోట్లు ఖర్చు పెడుతున్నామని, తగిన ఫలితాలు కనిపించాలని సూచించారు. సమావేశంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సీఓఓ దశరథరామిరెడ్డి, ఏఐఐఎల్‌ఎస్‌జీ ఏజన్సీ ప్రాజెక్టు డైరెక్టర్ రాజేష్, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎల్.వెంకటేశ్వరరావు, నోడల్ ఆఫీసర్ శివన్నారాయణ, వాష్ ఇన్‌స్టిట్యూట్ అధికారలు పాల్గొన్నారు.