మావిగన్ ఓ నవ్వులాట: పట్టాభి
ABN , Publish Date - Apr 06 , 2026 | 05:04 AM
మావిగన్ ప్రతిపాదనతో జగన్ కామెడీ పీస్‌గా మారారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. అభివృద్ధి అంటే జగన్‌కు నవ్వులాటగా మారిందన్నారు.
అమరావతి, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): మావిగన్ ప్రతిపాదనతో జగన్ కామెడీ పీస్‌గా మారారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. అభివృద్ధి అంటే జగన్‌కు నవ్వులాటగా మారిందన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధికి 2015లోనే చంద్రబాబు స్పష్టమైన ప్రణాళి కలు రూపొందించారని చెప్పారు. సీఆర్డీయే మ్యాప్ చూస్తే జగన్‌కు చంద్రబాబు విజన్ ఏమిటో అర్థమవుతుందన్నారు. విధ్వంసానికి మారుపేరైన జగన్ దగ్గర అభివృద్ధి పాఠాలు నేర్చుకునే దుస్థితిలో కూటమి ప్రభుత్వం లేదని చెప్పారు. సీఆర్డీయే అంటే అమరావతి మాత్రమే కాదని, విజయవాడ, గుంటూరు, తెనాలి.. వంటి ఆరు నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలతో కూడిన కోర్ రీజియన్, దీంత ోపాటు ఉయ్యూరు, నూజివీడు, పొన్నూరు వంటి మరో ఆరు మున్సి పాలిటీలతో కూడిన ఎక్సెటెండెడ్ రీజియన్ అన్నారు. జగ్గయ్యపేట వంటి రూరల్ మండ లాలతో కూడిన పెరిఫెరల్ ఎక్సెటెండెడ్ రీజియన్ కూడా రాజధానిలో భాగమే నన్నారు. మావిగన్ ప్రతిపాదనపై నేడు అంత ప్రేమ ఒలకబోస్తున్న జగన్ దాదా పు అంతే పరిధి ఉన్న సీఆర్డీయే చట్టాన్ని ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు.