లెవన్‌రెడ్డి జైలుకెళ్లడం ఖాయం: పట్టాభి
ABN , Publish Date - Jan 24 , 2026 | 06:25 AM
కేసులన్నీ కొలిక్కి వచ్చాయి. అతి త్వరలో జగన్ జైలుకెళ్లడం ఖాయం అని ఏపీ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు.
అనంతపురం క్లాక్‌టవర్, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ‘కేసులన్నీ కొలిక్కి వచ్చాయి. అతి త్వరలో జగన్ జైలుకెళ్లడం ఖాయం’ అని ఏపీ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని డంపింగ్ యార్డును శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘వైసీపీ ప్రభుత్వంలో మద్యం స్కాం జరిగిందని జగన్ ఆత్మ విజయసాయిరెడ్డి విచారణలో చెప్పారు. తిన్న మొత్తాన్ని కచ్చితంగా కక్కిస్తాం. జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రయోజనం లేదు. ఆయన్ను రెండోసారి ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధంగా లేరని విజయసాయి చెప్పడం కూటమి మరో రెండు మూడు దఫాలు అధికారంలోకి వస్తుందనేందుకు నిదర్శనం. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాలను పరుగులు పెట్టిస్తోంది’ అని పట్టాభి అన్నారు.