Share News

పాస్టర్‌ ఆనంద్‌ ఎస్సీ హోదా రద్దుపై గెజిట్‌

ABN , Publish Date - May 25 , 2026 | 04:51 AM

పాస్టర్‌ ఆనంద్‌ ఎస్సీ సర్టిఫికెట్‌ రద్దు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. బాపట్ల జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ శనివారం గెజిట్‌ విడుదల చేశారు.

పాస్టర్‌ ఆనంద్‌ ఎస్సీ హోదా రద్దుపై గెజిట్‌

బాపట్ల, మే 24(ఆంధ్రజ్యోతి): పాస్టర్‌ ఆనంద్‌ ఎస్సీ సర్టిఫికెట్‌ రద్దు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. బాపట్ల జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ శనివారం గెజిట్‌ విడుదల చేశారు. జిల్లాస్థాయి స్క్రూటినీ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకుని ఎస్సీ హోదా రద్దు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని గెజిట్‌లో స్పష్టం చేశారు. పాస్టర్‌ ఆనంద్‌ ఎస్సీ హోదాపై దాదాపు నెల రోజుల పాటు పలు దఫాలుగా బాపట్ల కలెక్టరేట్‌ వేదికగా విచారణలు జరిగాయి. తాజాగా గెజిట్‌ జారీ చేయడంతో ప్రక్రియ ముగిసింది.

Updated Date - May 25 , 2026 | 04:53 AM