Share News

‘రద్దు’ ఇక లాంఛనమే!

ABN , Publish Date - May 02 , 2026 | 04:41 AM

పాస్టర్‌ ఆనంద్‌ ఎస్సీ సర్టిఫికెట్‌ రద్దుకు సంబంధించి స్ర్కూట్నీ కమిటీ తుది విచారణ శుక్రవారంతో ముగిసింది. పిటిషనర్‌ అక్కల రామిరెడ్డితోపాటు పాస్టర్‌ ఆనంద్‌ వాదనను కూడా విన్న..

‘రద్దు’ ఇక లాంఛనమే!

  • పాస్టర్‌ ఆనంద్‌ ఎస్సీ సర్టిఫికెట్‌ వివాదంపై ముగిసిన తుది విచారణ

  • సర్టిఫికెట్‌ రద్దుకు సిఫారసు చేస్తాం: స్ర్కూట్నీ కమిటీ చైర్మన్‌ వెల్లడి

బాపట్ల, మే 1(ఆంధ్రజ్యోతి): పాస్టర్‌ ఆనంద్‌ ఎస్సీ సర్టిఫికెట్‌ రద్దుకు సంబంధించి స్ర్కూట్నీ కమిటీ తుది విచారణ శుక్రవారంతో ముగిసింది. పిటిషనర్‌ అక్కల రామిరెడ్డితోపాటు పాస్టర్‌ ఆనంద్‌ వాదనను కూడా విన్న కమిటీ తుది నివేదికను సిద్ధం చేసి కలెక్టర్‌కు సోమవారంలోగా పంపించనుంది. తుది విచారణ ముగిసిన తర్వాత డీఎల్‌ఎ్‌ససీ (డిస్ట్రిక్ట్‌ లెవల్‌ స్ర్కూట్నీ కమిటీ) చైర్మన్‌గా వ్యవహరిస్తున్న బాపట్ల జాయింట్‌ కలెక్టర్‌ భావన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇరు పక్షాల వాదనలు వినడంతో పాటు, అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలను కూడా పరిగణనలోకి తీసుకుని పాస్టర్‌ ఆనంద్‌ ఎస్సీ హోదా రద్దు కోరుతూ కలెక్టర్‌కు సోమవారం లోగా రికమండ్‌(సిఫారసు) చేస్తాం.’’ అని తెలిపారు. ఈ ప్రక్రియ అంతా త్వరలోనే ముగుస్తుందని కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న డీఆర్వో వివరించారు. అంతకుముందు.. మధ్యాహ్నం 12 గంటలకు బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో డీఎల్‌ఎ్‌ససీ సమావేశమైంది. ఏప్రిల్‌ 18న తొలి విచారణకు హాజరుకాని పాస్టర్‌ ఆనంద్‌ శుక్రవారం విచారణకు హాజరయ్యారు.

Updated Date - May 02 , 2026 | 04:41 AM