Kakinada District: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నుంచి పొగలు
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:13 AM
కాకినాడ జిల్లా జగ్గంపేట హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులోనుంచి పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురై ఒక్కసారిగా కిందకు దిగి పరుగులు తీశారు.
కిందకు దిగి పరుగులు తీసిన ప్రయాణికులు
జగ్గంపేట, జనవరి 18(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా జగ్గంపేట హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులోనుంచి పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురై ఒక్కసారిగా కిందకు దిగి పరుగులు తీశారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో దూరప్రాంతాలవారు ఎక్కడికక్కడ తిరుగు ప్రయాణమవుతున్నారు. ఈ నేపథ్యంలో వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో ఆదివారం రాత్రి 10.30 సమయంలో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో జగ్గంపేట ఫ్లైఓవర్‌పై బస్సును డ్రైవర్ వెంటనే నిలుపుదల చేశాడు. దీంతో ప్రయాణికులు బస్సు నుంచి కిందకు దిగి ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ సమయంలో బస్సులో 35మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంజన్‌లో సాంకేతిక లోపంతో మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తోంది.