రాజముద్రతో పాసు పుస్తకాలు
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:02 AM
భూ సంబంధిత సమస్యలను పరిష్కరించి రైతులకు రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్ అన్నారు.
g న్యాయశాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్
g చాబోలులో కలెక్టర్ రాజకుమారితో కలిసి పర్యటన
నంద్యాల రూరల్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) : భూ సంబంధిత సమస్యలను పరిష్కరించి రైతులకు రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్ అన్నారు. సోమవారం నంద్యాల రూరల్ మండలం చాబోలు గ్రామంలో కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కార్తీక్‌తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా (పీఎం-అభిమ్) పథకం కింద గ్రామీణ ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు, మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పల్లె పండుగ-2.0లో భాగంగా ఏ ర్పాటు చేసిన మినీ గోకులాన్ని పరిశీలించారు. గ్రామంలో ప్ర భుత్వ ఆసుపత్రి ఏ ర్పాటు కోసం సొంత స్థలాన్ని దానం చేసిన దాతను మంత్రి ప్ర త్యేకంగా ప్రశంసించా రు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలను పూర్తిస్థాయిలో తగ్గించాలనే ఉద్దేశంతో రీసర్వే ప్ర క్రియను దశలవారీగా అమలు చేస్తోందన్నా రు. సమావేశంలో కేసీ కెనాల్ డీసీ చైౖర్మన ఇలియాజ్ బాషా, ఆర్డీవో విశ్వనాథ్, రూ రల్ తహసీల్దార్ శ్రీవాణి, చాబోలు సర్పంచ కడియం మౌనిక, నాయకులు ఉన్నారు.
రైతు సంక్షేమమే టీడీపీ ధ్యేయం
పాణ్యం: రైతు సంక్షేమమే టీడీపీ ధ్యే యమని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యేగౌరుచరిత అన్నారు. మీభూమి-మీహక్కు కార్యక్రమం లో భాగంగా ఆమె సోమవారం గోనవరంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. గ్రామంలో పంటభూములకు రస్తాలు, నిర్మాణంలో ఆగిన అంగనవాడీ, ఆర్బీకే భవనం నిర్మాణం పూర్తి చేయాలని గ్రామ టీడీపీ నాయకులు దానం కోరారు. గోనవరంలోని మోడల్ ప్రైమరీ పాఠశాలను పరిశీలించారు. స్థానిక ఎంపీడీ వో కార్యాలయంలో సచివాలయాల, పంచాయతీ, ఇంజనీరింగ్ సిబ్బందితో గృహనిర్మాణాలపై సమావేశం నిర్వహించారు. గ్రామంలో శిథిలావస్థకు చేరిన నర్సింగ్ హాస్టల్ భవనాన్ని పరిశీలించి నూతన భవన నిర్మాణాన్ని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రైతు బజారు ఏర్పాటుకు స్థల సేకరణ చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దారు నరేంద్రనాథ్ రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఎంఈవో సుబ్రహ్మణ్యం, ఎంపీటీసీ రంగరమేష్, మార్కెట్ యార్డు ఉపాధ్యక్షుడు గోవర్థన రెడ్డి, సీఐ కిరణ్ కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ నరేంద్ర కుమార్‌రెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ జయరామిరెడ్డి, నాయకులు ఖాదర్‌బాషా, రమణమూర్తి, రామ్మోహననాయుడు, అమరసింహారెడ్డి, దానం, నారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.