ఎక్స్‌రే రూమ్‌లో చికిత్స!
ABN , Publish Date - Jun 29 , 2026 | 05:28 AM
పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు ఎక్స్‌రే గదిలోనే చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ సరిపడా పడకలు లేకపోవడంతో...
ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురికి వైద్యం
మన్యం జిల్లా ప్రభుత్వాస్పత్రుల్లో దుస్థితి
పార్వతీపురం, జూన్ 28(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు ఎక్స్‌రే గదిలోనే చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ సరిపడా పడకలు లేకపోవడంతో ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురు రోగులు సర్దుకోవాల్సి వస్తోంది. కురుపాం, గుమ్మలక్ష్మీపురం భద్రగిరి ఆస్పత్రులకు సంబంధించి అదనపు భవన నిర్మాణాలు పూర్తయినప్పటికీ ఇంకా ప్రారంభించ లేదు. ప్రస్తుతం సీజన్ మార్పుతో ఆస్పత్రుల్లో జ్వర పీడితుల తాకిడి పెరుగుతోంది. కురుపాం సీహెచ్‌సీలో 32 పడకలు ఉన్నాయి. ఒక్కో వార్డులో పది మంచాల చొప్పున ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తున్నారు. అయితే రోగుల సంఖ్య పెరగడంతో ఆదివారం ఎక్స్‌రే గదితో పాటు వరండాలో కూడా రోగులకు చికిత్స చేశారు. పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రిలో 150 పడకలు ఉండగా ఇన్ పేషెంట్ల సంఖ్య 318 వరకూ ఉంది. ఇక్కడ ఒక్కో మంచంపై ఇద్దరు రోగులు వైద్య సేవలు పొందుతున్నారు.