Share News

వ్యక్తి ప్రాణం నిలిపిన.. కలెక్టర్‌ ఔదార్యం

ABN , Publish Date - Apr 13 , 2026 | 06:02 AM

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కృష్ణాపురానికి చెందిన శ్రీనివాసరావు ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై సీతానగరం నుంచి స్వగ్రామానికి బయల్దేరాడు

వ్యక్తి ప్రాణం నిలిపిన.. కలెక్టర్‌ ఔదార్యం

  • వడ దెబ్బకు బైక్‌ పైనుంచి పడి.. గాయపడిన వ్యక్తి

పార్వతీపురం/సీతానగరం/బెలగాం, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కృష్ణాపురానికి చెందిన శ్రీనివాసరావు ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై సీతానగరం నుంచి స్వగ్రామానికి బయల్దేరాడు. ఎండ తీవ్రతకు అతడు చినభోగిల వద్ద బైక్‌ పైనుంచి పడి, గాయపడ్డాడు. అటుగా వెళ్తున్న పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అతడిని చూసి వాహనాన్ని ఆపారు. శ్రీనివాసరావును తన వాహనంలో ఎక్కించుకుని సీతానగరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. డాక్టర్లు శ్రీనివాసరావుకు వైద్య సేవలు అందించి ప్రాణాపాయం నుంచి గట్టెక్కించారు.

Updated Date - Apr 13 , 2026 | 06:04 AM