మాస్టారూ.. మావాడు ఎలా చదువుతున్నాడు!
ABN , Publish Date - Jul 25 , 2026 | 05:51 AM
‘మా వాడు ఎలా చదువుతున్నాడు మాస్టారు’.. అంటూ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ పాఠశాల టీచర్లను సబ్జెక్టుల వారీగా అడిగి తెలుకున్నారు.
మెగా పేరెంట్స్- టీచర్స్ మీటింగ్‌లో మన్యం కలెక్టర్ ఆరా
పార్వతీపురం/పార్వతీపురం టౌన్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ‘మా వాడు ఎలా చదువుతున్నాడు మాస్టారు’.. అంటూ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ పాఠశాల టీచర్లను సబ్జెక్టుల వారీగా అడిగి తెలుకున్నారు. పార్వతీపురం పట్టణంలోని ప్రభుత్వ(డీవీఎంఎం) పాఠశాలలో మెగా పేరెంట్స్- టీచర్స్ మీటింగ్ సందర్భంగా ఈ ఆసక్తికర సంఘటన జరిగింది. శుక్రవారం నిర్వహించిన ఈ సమావేశానికి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఓ తండ్రిగా హాజరయ్యారు. అదే పాఠశాలలో ఆయన కుమారుడు ఎన్.క్రి్‌షధరణ్ రెడ్డి పదో తరగతి చదువుతున్నాడు. తన కుమారుడి చదువుపై కలెక్టర్ ఆరా తీశారు.