Share News

పరిటాలలో వజ్రాల వేట!

ABN , Publish Date - Jul 11 , 2026 | 05:25 AM

సాగు కోసం దున్నిన భూముల్లో వీరంతా వెతుకున్నది వజ్రాల కోసం. ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామ చెరువు సమీపంలో శుక్రవారం కనిపించిందీ దృశ్యం.

పరిటాలలో వజ్రాల వేట!

ఇంటర్నెట్ విభాగం: సాగు కోసం దున్నిన భూముల్లో వీరంతా వెతుకున్నది వజ్రాల కోసం. ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామ చెరువు సమీపంలో శుక్రవారం కనిపించిందీ దృశ్యం. తొలకరి వర్షాలు కురిసే సమయంలో ఇక్కడి భూముల్లో వజ్రాలు దొరుకుతాయని వీరి నమ్మకం. అయితే ఇప్పటి వరకూ ఎవరికీ వజ్రాలు దొరికిన జాడ లేదు కానీ రంగురాళ్లు దొరుకుతున్నాయని చెబుతున్నారు. వీటి కోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి జనం ఇక్కడికి తరలివస్తున్నారు. ఓ వజ్రం దొరక్కపోతుందా.. మన కష్టాలు తీరకపోతాయా అనే ఆశతో.. వీరంతా మట్టిని జల్లెడ పడుతున్నారు.

- కంచికచర్ల, ఆంధ్రజ్యోతి

Updated Date - Jul 11 , 2026 | 05:26 AM