Share News

తాత్కాలికంగా పాపికొండలు విహారయాత్ర నిలిపివేత

ABN , Publish Date - Jun 14 , 2026 | 05:22 AM

కొండలు విహారయాత్రకు వెళ్లే బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు రంపచోడవరం ఆర్డీవో కె.స్వాతి శనివారం తెలిపారు.

తాత్కాలికంగా పాపికొండలు విహారయాత్ర నిలిపివేత

దేవీపట్నం, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): పాపికొండలు విహారయాత్రకు వెళ్లే బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు రంపచోడవరం ఆర్డీవో కె.స్వాతి శనివారం తెలిపారు. పోలవరం జిల్లా కలెక్టర్‌ దినేష్ కుమార్‌ ఆదేశాల మేరకు గోదావరి నదిలో నడుస్తున్న అన్ని పర్యాటక బోట్లపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ఆమె ఆదేశించారు. ఇటీవల దేవీపట్నం సమీపంలో పాపికొండలు విహారయాత్రకు 89 పర్యాటకులతో వెళుతున్న పర్యాటక బోటు గోదావరి మధ్యలో నిలిచిపోయింది. అంతే కాకుండా వారానికి ఒక బోటు సాంకేతిక లోపాలతో నది మధ్యలో నిలిచిపోతున్నట్టు అధికారుల దృష్టికి రావడంతోపాటు, బోట్ల నిర్వాహకుల తీరుపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు, పర్యాటక, మత్య్సశాఖ ఇతర అధికారుల బృందం నివేదిక ఆధారంగా అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నట్టు నిర్ధారణ అయిన అనంతరం పర్యాటక బోట్లకు అనుమతి లభిస్తుందని ఆర్డీవో తెలిపారు. బోట్ల తనిఖీలు పూర్తయ్యే వరకు గోదావరి నదిలో పర్యాటక బోట్లు నడపరాదని హెచ్చరించారు.

Updated Date - Jun 14 , 2026 | 05:23 AM