పాపికొండలు విహారయాత్ర పునఃప్రారంభం
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:27 AM
గోదావరి నదిలో పాపికొండల విహారయాత్ర మళ్లీ ప్రారంభమయ్యింది. కొద్ది రోజుల కిందట 89 మంది పర్యాటకులతో పాపికొండలు వెళ్తున్న..
దేవీపట్నం, జూలై 4(ఆంధ్రజ్యోతి): గోదావరి నదిలో పాపికొండల విహారయాత్ర మళ్లీ ప్రారంభమయ్యింది. కొద్ది రోజుల కిందట 89 మంది పర్యాటకులతో పాపికొండలు వెళ్తున్న బోటు పాత దేవీపట్నం సమీపంలో గోదావరి మధ్యలో నిలిచిపోయింది. దీంతో విహారయాత్రకు వెళ్లే బోట్లను కలెక్టర్ నిలిపివేశారు. ఆ తర్వాత పర్యాటక బోట్ల ఫిట్‌నెస్‌ను అధికారులతో తనిఖీలు చేయించి, పలు సూచనలు చేశారు. ఆపై శనివారం నుంచి విహారయాత్రకు వెళ్లే బోట్లకు అనుమతి ఇచ్చారు. దీంతో 15 ప్రైవేట్ బోట్లు, ఒక ఏపీ టూరిజం పర్యాటక బోటు విహార యాత్రకు సిద్ధమయ్యాయి. శనివారం 88 మంది పర్యాటకులతో జలశ్రీ బోటు పాపికొండలు వెళ్లింది.