జలవనరుల శాఖలో పదోన్నతులపై ప్యానెల్
ABN , Publish Date - Jun 11 , 2026 | 05:07 AM
జల వనరుల శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల(డీఈఈ) రెగ్యులర్ పదోన్నతుల కోసం రాష్ట్రస్థాయిలో ప్యానెల్‌ను నియమిస్తూ ఆ శాఖ..
అమరావతి, జూన్ 10(ఆంధ్రజ్యోతి): జల వనరుల శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల(డీఈఈ) రెగ్యులర్ పదోన్నతుల కోసం రాష్ట్రస్థాయిలో ప్యానెల్‌ను నియమిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ బుధవారంఉత్తర్వు జారీ చేశారు. ఈ ప్యానెల్ కన్వీనర్‌గా జల వనరుల శాఖ ఇంజనీర్ -ఇన్-చీఫ్(అడ్మిన్), అడిషనల్ సెక్రటరీ/జాయింట్ సెక్రటరీ/డిప్యూటీ సెక్రటరీ, ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఇరిగేషన్) ను సభ్యులుగా నియమించారు. ఈ ప్యానల్ 2025-26లో పదోన్నతులు పొందే డీఈఈల జాబితాను పరిశీలిస్తుంది.