Share News

గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్‌: పంచుమర్తి

ABN , Publish Date - May 07 , 2026 | 04:08 AM

జగన్‌... కిల్లర్‌ పార్టీ, క్రిమినల్‌ పార్టీ, గొడ్డలి పార్టీకి అధ్యక్షుడు అని శాసనమండలి చీఫ్‌ విప్‌ పంచుమర్తి అనురాధ అన్నారు.

గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్‌: పంచుమర్తి

అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): జగన్‌... కిల్లర్‌ పార్టీ, క్రిమినల్‌ పార్టీ, గొడ్డలి పార్టీకి అధ్యక్షుడు అని శాసనమండలి చీఫ్‌ విప్‌ పంచుమర్తి అనురాధ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘నేర చరిత్ర ఉన్న రాజకీయ నాయకుడు జగన్‌ను పరిశోధనా అంశంగా తీసుకొని ప్రపంచంలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో అధ్యయనం చేస్తున్నారు. జావా డిస్కవరీ అనే ఇన్వెస్టిగేషన్‌ చానల్‌ ‘ప్లానెట్‌ కిల్లర్స్‌... ది ఫారెస్ట్‌ డిస్ట్రాయర్‌’ పేరుతో జగన్‌ గ్యాంగ్‌ అరాచకాలను ప్రపంచవ్యాప్తం చేసింది. ఈ డాక్యుమెంటరీలో జగన్‌ ముఖ్య అనుచరుడు కొల్లం గంగిరెడ్డి పేరును ప్రముఖంగా పేర్కొన్నారు. జగన్‌ తన నేర చరిత్రతో ప్రపంచస్థాయికి ఎదిగితే.. చంద్రబాబు తాను చేస్తున్న అభివృద్ధితో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. వైసీపీలో ఏ నాయకుడిని చూసినా ఒక నేర చరిత్ర ఉంటుంది’’ అని పంచుమర్తి విమర్శించారు.

Updated Date - May 07 , 2026 | 04:08 AM