చైర్మన్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు: పంచుమర్తి
ABN , Publish Date - Feb 19 , 2026 | 06:15 AM
శాసనమండలి చైర్మన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ఆరోపించారు.
ఇంటర్నెట్ డెస్క్ : శాసనమండలి చైర్మన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ఆరోపించారు. సంబంధంలేని కంపెనీలు, వ్యవహారాల గురించి వైసీపీ సభ్యులు దూషించేవిధంగా వాయిదా తీర్మానాలు ఇచ్చి, సభా సమయాన్ని వృధా చేస్తున్నారన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అనురాధ మాట్లాడారు. చైర్మన్ సభను అదుపులో పెట్టడంలో విఫలం అయ్యారని, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.