Share News

జీవో 91తో పంచాయతీ కార్యదర్శులకు గుర్తింపు

ABN , Publish Date - Apr 06 , 2026 | 05:07 AM

పంచాయతీ కార్యదర్శుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు హర్షణీయమని పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బగ్గా జగదీశ్‌ అన్నారు.

జీవో 91తో పంచాయతీ కార్యదర్శులకు గుర్తింపు

  • ‘థాంక్యూ డిప్యూటీ సీఎం’ అంటూ కార్యదర్శుల సంఘం హర్షం

విజయవాడ గవర్నర్‌పేట, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): పంచాయతీ కార్యదర్శుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు హర్షణీయమని పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బగ్గా జగదీశ్‌ అన్నారు. విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో ఆదివారం జోన్‌-2 గ్రేడ్‌-5 పంచాయతీ కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ‘థాంక్యూ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌’ అని ముద్రించిన పోస్టర్‌ను ప్రదర్శించారు. అనంతరం జగదీశ్‌ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శుల కష్టాన్ని గుర్తించి జీవో నెంబరు 91 విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ జీవో ద్వారా రాష్ట్రంలోని 359 రూరల్‌-అర్బన్‌ పంచాయతీలను ఏర్పాటు చేయడంతో పాటు, గ్రేడ్‌-4, 5 కార్యదర్శులను పీడీవో గ్రేడ్‌-3గా హోదాకు మార్చడం జరిగిందని తెలిపారు. వారి పేస్కేల్‌ను రూ.28,280కు ప్రతిపాదించడం ప్రభుత్వం ఇచ్చిన పెద్ద ప్రోత్సాహమన్నారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించి. మెరుగైన ప్రయోజనాలు చేకూర్చిన సీఎం, డిప్యూటీ సీఎం, ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో రాష్ట్రస్థాయి బహిరంగ సభ ఏర్పాటుచేసి డిప్యూటీ సీఎంను సత్కరిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీ జీడబ్ల్యూఎ్‌సఈ జేఏసీ పక్షాన అసోసియేట్‌ చైర్మన్‌ పిల్లి హరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2026 | 05:08 AM