పంచాయతీరాజ్‌కు పవన్‌తో జాతీయ గుర్తింపు : సీఎం
ABN , Publish Date - May 17 , 2026 | 05:26 AM
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ రూప్‌టాప్స్, గ్రామాల్లో మ్యాజిక్ డ్రైన్లు ఏర్పాటు చేస్తాం.
ఇంటర్నెట్ డెస్క్: ‘‘పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ రూప్‌టాప్స్, గ్రామాల్లో మ్యాజిక్ డ్రైన్లు ఏర్పాటు చేస్తాం. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ శాఖకు ఏకంగా జాతీయస్థాయిలో ఎనిమిది అవార్డులు రావడం సంతోషకరం. ఆయన పనితీరుకు ఇది నిదర్శనం. స్వచ్ఛాంధ్ర అనేది కేవలం ప్రభుత్వ పథకం కాదు, అది ప్రతి ఒక్కరి జీవన విధానంగా మారాలి’’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.