Share News

పల్లెపండగ3.0

ABN , Publish Date - Sep 28 , 2026 | 02:19 AM

రాష్ట్రవ్యాప్తంగా మరో పల్లె పండగకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రూ.11,085 కోట్ల వ్యయంతో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టనుంది. మంగళవారం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం రామాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి శాఖ కూడా చూస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా పల్లె పండగ 3.0 పనులు ప్రారంభించనున్నారు.

పల్లెపండగ3.0
PALLEPANDUGA

CM.jpg

  • రూ.11,085 కోట్లతో రేపే పనులకు శ్రీకారం

  • నెల్లూరు జిల్లా ఉదయగిరిలో

ప్రారంభించనున్న సీఎం, డిప్యూటీ సీఎం

  • 2700 కోట్లతో 6 వేల కి.మీ. సీసీ రోడ్లు

  • 7550 కోట్లతో 9500 కి.మీ. బీటీ రోడ్లు

  • పాడిరైతుల కోసం రూ.300 కోట్లతో

22 వేల మినీ గోకులాల నిర్మాణం

  • తోటల పెంపకానికి 225 కోట్లు

  • మ్యాజిక్‌ డ్రెయిన్లకు 110 కోట్లు

  • వీబీ-జీరామ్‌జీ కింద 1750 కోట్లు

  • 3800 కోట్లతో హార్టీకల్చర్‌ హబ్‌ పనులు

  • పల్లెపండుగ 1.0, 2.0 కింద

  • గత రెండేళ్లలో పల్లెల్లో ప్రగతి

  • 20 వేల కోట్లతో పెద్దఎత్తున అభివృద్ధి

  • 22000 మినీ గురుకులాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రవ్యాప్తంగా మరో పల్లె పండగకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రూ.11,085 కోట్ల వ్యయంతో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టనుంది. మంగళవారం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం రామాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి శాఖ కూడా చూస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా పల్లె పండగ 3.0 పనులు ప్రారంభించనున్నారు. దీనికింద గ్రామాల్లో రూ.2700 కోట్ల వ్యయంతో 6 వేల కి.మీ. సిమెంట్‌ రోడ్లు, రూ.7550 కోట్ల వ్యయంతో 9500 కి.మీ. బీటీ రోడ్ల పనులు.. రూ.300 కోట్లతో పాడి రైతుల కోసం 22 వేల మినీ గోకులాల నిర్మాణం.. రూ.225 కోట్ల వ్యయంతో ఉద్యానవన శాఖ ద్వారా 50 వేల ఎకరాల్లో తోటల పెంపకం.. రూ.110 కోట్ల వ్యయంతో 1000 కి.మీ. మ్యాజిక్‌ డ్రెయిన్ల నిర్మాణం, రూ.200 కోట్లతో బస్సు షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, రచ్చబండలు తదితర పనులు చేపడతారు. అలాగే జాతీయ ఉపాధి పథకం వీబీ-జీరామ్‌జీ కింద రూ.1750 కోట్లు, గ్లోబల్‌ హార్టీకల్చర్‌ హబ్‌ కింద రూ.3800 కోట్లు, నాబార్డ్‌, సాస్కీ, ఇతర నిధులు రూ.2 వేల కోట్లతో ఇతరత్రా పనులు చేపట్టనున్నారు.


గ్రామీణాభివృద్ధి పరుగులు..

కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గ్రామీణాభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది. పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ వేగంగా కార్యక్రమాలు చేపట్టింది. అధికారులకు టార్గెట్లు పెట్టి ఆ శాఖకు పూర్వ వైభవం తీసుకొచ్చారు. రూ.10,500 కోట్లతో పల్లెపండగ 1.0 చేపట్టారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం 884 కిమీ సిమెంట్‌ రోడ్లను నిర్మిస్తే..

కూటమి ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే పల్లెపండుగ కింద 4 వేల కి.మీ సీసీ రోడ్లు, 22514 మినీ గోకులాలు, 21 వేల పంటకుంటలు, 64 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటల పెంపకం చేపట్టింది. అదే విధంగా రెండో ఏడాదిలో రూ.10,100 కోట్లతో పల్లెపండుగ 2.0 కింద 2500 కిమీ సీసీ రోడ్లు, 8300 కిమీ బీటీ రోడ్లు, 15,750 మినీ గోకులాలు, 15,500 పశువుల తొట్టెలు, 86 వేల పంటకుంటలు, 82 వేల వ్యక్తిగత సోక్‌పిట్ల నిర్మాణం చేపట్టి గ్రామాల రూపురేఖలు మార్చేసింది.

ఉపాధి నిధుల వ్యయంతో పురోగతి..

గత టీడీపీ పాలనలో తప్ప ఎప్పుడూ లేని విధంగా గడచిన రెండేళ్లలో రూ.వేల కోట్ల ఉపాధి నిధులు ఖర్చుచేసి తిరిగి ఉపాధి హామీ పథకానికి పూర్వ వైభవం తీసుకొచ్చారు. ఉపాధి పథకంలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ నంబర్‌ వన్‌. జగన్‌ ప్రభుత్వం అట్టడుగుకు తీసుకెళ్లింది. రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం తిరిగి అగ్రస్థానానికి చేర్చేందుకు అన్ని చర్యలూ తీసుకుంది. మన గ్రామాలు వ్యవసాయం కంటే వ్యవసాయ అనుబంధ రంగాలపైనే ఎక్కువ ఆధారపడి ఉన్నాయి. అలాంటి గ్రామీణ పేదలకు ఆర్థికంగా అండదండలందించి మినీ గోకులాలను నిర్మించాలని తలపెట్టారు. రెండేళ్లలోనే 38 వేల మినీ గోకులాలను నిర్మించి మూగజీవులకు గృహవసతి కల్పించారు. ఏ గ్రామానికి వెళ్లినా మినీ గోకులాలు అట్టహాసంగా దర్శనమిస్తున్నాయి. గతంలో చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిమెంట్‌ రోడ్లు తప్ప.. జగన్‌ ఐదేళ్ల పాలనలో కొత్తవి వేయనేలేదు. కూటమి వచ్చాక ఈ 27 నెలల్లోనే 6500 వేల కిమీ సిమెంట్‌ రోడ్లను, 8300 కిమీ బీటీ రోడ్లను నాణ్యతపై రాజీపడకుండా నిర్మించి చరిత్ర సృష్టించింది.


పంచాయతీలకు కేంద్రమిచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ చార్జీల పేరిట దిగమింగే రోజులు పోయాయి. కూటమి ప్రభుత్వం రాగానే.. జగన్‌ హయాంలో ఆగిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధులను తీసుకొచ్చింది. పంచాయతీలకు బదిలీ చేసింది. ఇప్పుడు గ్రామాల్లో పంచాయతీ నిధులు తగిన అవసరాలకు స్వేచ్ఛగా ఖర్చు చేయగలుగుతున్నారు. గతంలో మాదిరిగా బిల్లులు వస్తాయో లేదోనన్న ఆందోళన సర్పంచ్‌లకు ఇప్పుడు లేదు. అలాగే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌ యోజన పథకం అమలులో ఆఖరి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు మొదటి స్థానానికి చేరుకుంది.

పంచాయతీల పన్నుల చెల్లింపుల ప్రక్రియను సరళీకృతం చేశారు. ఆన్‌లైన్‌ చెల్లింపుల విధానం తెచ్చారు. వైసీపీ హయాంలో అన్ని కేంద్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి పథకాల అమల్లో రాష్ట్రం చివరి స్థానంలో నిలవగా.. ఇప్పుడు ముందు వరుసలో నిలబెట్టేలా చర్యలు ప్రారంభించారు. పంచాయతీ పాలనలో కేరళ ఆదర్శంగా, అభివృద్ధిలో దేశానికి తలమానికంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించి ముందుకు అడుగులు వేస్తున్నారు.

స్వర్ణ పంచాయతీ పోర్టల్‌..

గతంలో పంచాయతీల్లో పన్నుల వసూళ్లలో పారదర్శకత లోపించింది. దీంతో కూటమి ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానం తీసుకొచ్చింది. ఇందుకోసం స్వర్ణ పంచాయతీ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. ఎవరైనా, ఎక్కడి నుంచైౖనా ఈ వెబ్‌సైట్‌ ద్వారా చెల్లించే సౌకర్యం కల్పించారు. గత ఏడాది రూ.618 కోట్ల పన్నులు వసూలు చేయగలిగితే.. ఈ పది నెలల్లో రూ.1000 కోట్లు వసూలు చేశారు. పంచాయతీల్లో అభివృద్ధి పనులపైనా నిఘా పెంచారు.

పంచాయతీ గ్రామసభల ప్రపంచ రికార్డు...

గతంలో ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్రవ్యాప్తంగా 13,218 గ్రామ పంచాయతీలకు ఒకే రోజు గ్రామసభలు నిర్వహించి రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ప్రపంచ రికార్డు సాధించింది. పంచాయతీల్లో నిర్వహించాల్సిన పనులకు సంబంధించి ఒకే రోజు తీర్మానాలు ఆమోదించడం ద్వారా తదుపరి పనుల పరిపాలనా ఆమోదానికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చేశారు. దీంతో పాటు ఆయా పంచాయతీల్లో ఏ పనులు చేపడుతున్న విషయం గ్రామస్తులందరికీ తెలిసేలా, ఏయే పనులు చేపడుతున్నారో రాష్ట్రమంతా తెలిసేలా వెబ్‌లో కూడా ఉంచారు.


కీలక సంస్కరణలు..

లక్ష మందికి పైగా ఉద్యోగులున్న ఈ శాఖలో పాలన ఒక తాటి మీద లేకపోవడంతో గ్రామీణాభివృద్ధి సజావుగా సాగని పరిస్థితి ఉండేది. ఎన్నో ఏళ్లుగా సంస్కరణలు తీసుకురావాలన్న ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా జిల్లాలో పంచాయతీరాజ్‌ వ్యవస్థలన్నీ ఒకే చోట ఉండాలని నిర్ణయించారు. జడ్పీ సీఈవో, డీఎల్‌డీవో, డీపీవో, పీఆర్‌ ఇంజనీరింగ్‌ ఎస్‌ఈ కార్యాలయాలన్నింటినీ ఒకే కాంపౌండ్‌లో ఏర్పాటు చేశారు. గ్రామీణాభివ్ధృధ్ధి, పంచాయతీరాజ్‌లకు సంబంధించి ఒకే చోట అన్ని రకాల పనులూ చక్కబెట్టుకునేలా సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా పంచాయతీరాజ్‌లో అన్నీ విభాగాల్లో పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేశారు. శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డీపీసీ) ఏర్పాటు చేసి ఏటా పదోన్నతుల్లో జాప్యం లేకుండా చర్యలు చేపడుతున్నారు.

Updated Date - Sep 28 , 2026 | 02:19 AM