మనోహరం.. పల్లం తీరం!
ABN , Publish Date - Apr 14 , 2026 | 04:59 AM
ఓవైపు సంద్రం.. మరోవైపు గోదారి పాయ మధ్య అలలారే సుందర క్షేత్రం కోనసీమలోని కాట్రేనికోన మండల శివారు.. పల్లం తీరప్రాంతం. ఇది బంగాళాఖాతం తీరాన ఉండి...
ఇంటర్నెట్ డెస్క్: ఓవైపు సంద్రం.. మరోవైపు గోదారి పాయ మధ్య అలలారే సుందర క్షేత్రం కోనసీమలోని కాట్రేనికోన మండల శివారు.. పల్లం తీరప్రాంతం. ఇది బంగాళాఖాతం తీరాన ఉండి, అటు సముద్రం, ఇటు గోదావరి పాయల కలయికతో అత్యంత రమణీయంగా ఉంటుంది. ఇక్కడి జనాభా 11వేలు కాగా, 7200 మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు అందరూ మత్స్యకార కుటుంబాలవారే. గ్రామం చుట్టూ గోదావరి పాయలు, ఉప్పుటీర్లు చుట్టి ఉంటాయి. ఇక్కడి వారికి చేపలు వేట జీవనాధారం. రొయ్యలు, పీతలు, రకరకాల సముద్రపు చేపలకు ఈ ప్రాంతం ప్రసిద్థి. ఏటా అక్టోబర్లో జరిగే ధనమ్మ తల్లి జాతర ఇక్కడి ప్రత్యేకత. సమీపంలోని కందికుప్ప రిజర్వ్ ఫారెస్ట్, మడ అడవులు పర్యావరణ ప్రేమికులను ఆకర్షిస్తాయి. ఇవి సముద్రపు అలల నుంచి భూమిని రక్షించడంలో కీలక పాత్రపోషిస్తుండగా, తీర ప్రాంత గ్రామం కావడంతో రవాణా సౌకర్యాలు, రక్షిత మంచినీటి సమస్య తరచుగా తలెత్తుతుంటుంది. సముద్రం గ్రామం వైపుకు చొచ్చుకువస్తుండటంతో తీర ప్రాంత ఇళ్లు ప్రమాదంలో పడుతున్నాయి.