బుల్లెట్ ప్రూఫ్ వాహనం వెనక్కి!
ABN , Publish Date - May 20 , 2026 | 03:52 AM
ఇంధన పొదుపుపై ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
కాన్వాయ్ కుదింపు.. ఇంధన పొదుపు బాటలో పల్లా
గాజువాక(విశాఖపట్నం), మే 19(ఆంధ్రజ్యోతి): ఇంధన పొదుపుపై ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తన కాన్వాయ్‌ను తగ్గించుకున్నారు. ‘వై’ కేటగిరీ భద్రతలో భాగంగా తనకు కల్పించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని తిరిగి పోలీస్ శాఖకు అప్పగించేశారు. 2+2గా ఉన్న గన్‌మెన్‌ను 1+1 సరిపోతారంటూ భద్రతను కూడా తగ్గించుకున్నారు. ఇకపై ఎస్కార్ట్ వాహనాలకు దూరంగా ఉంటూ సొంత వాహనంలోనే నియోజకవర్గంలో పర్యటించనున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో మెలగాలని పల్లా సూచించారు.