కూటమిని కూల్చడం ఎవరి తరం కాదు: పల్లా
ABN , Publish Date - Jan 24 , 2026 | 06:36 AM
కూటమిని విడగొడితే వైసీపీ గెలుస్తుందని విజయసాయి చెప్పడం వారి భ్రమ. కూటమిని కూల్చడం ఎవరి తరం కాదు.
అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ‘కూటమిని విడగొడితే వైసీపీ గెలుస్తుందని విజయసాయి చెప్పడం వారి భ్రమ. కూటమిని కూల్చడం ఎవరి తరం కాదు. వైసీపీ చేసే ఫేక్ ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ‘ప్రజల తీర్పును గౌరవించి జగన్ అసెంబ్లీకి రావాలి. లోకేశ్ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా జరుపుకోవడం... టీడీపీ శ్రేణులు ఉంచుకున్న అచంచలమైన నమ్మకానికి స్పష్టమైన నిదర్శనం. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తూ... పారిశ్రామిక అభివృద్ధి వికేంద్రీకరణ చాంపియన్‌గా లోకేశ్ గుర్తింపు పొందారు’ అని పల్లా అన్నారు.