Palla Srinivas Rao: ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు: పల్లా
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:45 AM
తెలుగుజాతికి ఆత్మవిశ్వాసం, రాజకీయ చైతన్యం ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని, ఆయన ఆశయాలను భుజాలపై మోస్తూ ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు...
తెలుగుజాతికి ఆత్మవిశ్వాసం, రాజకీయ చైతన్యం ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని, ఆయన ఆశయాలను భుజాలపై మోస్తూ ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు చంద్రబాబు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను దేశానికే మార్గదర్శకంగా నిలిపిన చంద్రబాబు నేడు నవ్యాంధ్ర రాజధాని అమరావతితో మరోమారు ప్రపంచ పటంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నారని వివరించారు.