అమెరికాలో వివాహం.. ఆన్‌లైన్‌లో ఆశీస్సులు
ABN , Publish Date - Sep 28 , 2026 | 04:25 AM
అమెరికాలో జరిగిన తమ పిల్లల వివాహానికి ఆ తల్లిదండ్రులు హాజరు కాలేకపోయారు. దీంతో టెక్నాలజీ సాయంతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి వధూవరులను ఆశీర్వదించారు.

వీసా రాక పలాస నుంచి
వీక్షించిన వధూవరుల తల్లిదండ్రులు
పలాస, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో జరిగిన తమ పిల్లల వివాహానికి ఆ తల్లిదండ్రులు హాజరు కాలేకపోయారు. దీంతో టెక్నాలజీ సాయంతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి వధూవరులను ఆశీర్వదించారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక ఎంపీడీవో కార్యాలయం రోడ్డులో నివాసముంటున్న కె.జోసెఫ్, సుజాత దంపతుల కుమారుడు మానసీస్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన హెబ్‌జీబా అనే యువతి కూడా అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. వీరిద్దరూ అమెరికాలో ఆదివారం పెళ్లి చేసుకున్నారు. అయితే వీసా లభించకపోవడంతో ఆ వివాహానికి వధూవరుల తల్లిదండ్రులు వెళ్లలేకపోయారు. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వివాహాన్ని తిలకించారు. పలాసలోని మానసీస్ ఇంటి వద్ద ఉన్న చర్చిలో పెద్ద స్ర్కీన్ ఏర్పాటుచేసి ఇరువురి కుటుంబీకులు, ఆహ్వానితులను పిలిచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఆశీర్వాదాలు అందజేశారు. విందు భోజనాలు ఏర్పాటు చేశారు.