Share News

విదేశీ పక్షుల సందడి

ABN , Publish Date - Apr 07 , 2026 | 06:09 AM

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంఎం.ముప్పాళ్లలో విదేశీ పక్షులు కనువిందు చేస్తున్నాయి. ఏటా వేసవి కాలంలో ఇక్కడకు వచ్చి విడిది చేస్తుంటాయి.

విదేశీ పక్షుల సందడి

నాగులుప్పలపాడు, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంఎం.ముప్పాళ్లలో విదేశీ పక్షులు కనువిందు చేస్తున్నాయి. ఏటా వేసవి కాలంలో ఇక్కడకు వచ్చి విడిది చేస్తుంటాయి. వీటి రెక్కల చివర ఉండే గులాబీ రంగు కారణంగా వీటికి పెయింటెడ్‌ స్టోర్క్స్‌ అన్న పేరు వచ్చింది. వీటిని తెలుగులో ఎర్ర కాళ్ల కొంగ అని పిలుస్తారు. వీటికాళ్లు పొడవుగా.. తెలుపు రంగుపై నలుపు మచ్చలతో ఉండి, బలమైన శరీర సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. సుమారు 12 అంగుళాల పొడవుండే పసుపు రంగు ముక్కు ఆకర్షణీయంగా ఉంటుంది. ఎం.ముప్పాళ్ల చెరువు మధ్యలో ఉన్న చెట్లపై ఇవి గూళ్లను ఏర్పాటు చేసుకున్నాయి. 100కిపైగా పక్షులు వేసవి ముగిసే వరకు ఉండి వెళ్లిపోతాయని గ్రామస్థులు తెలిపారు.

Updated Date - Apr 07 , 2026 | 06:09 AM