Share News

బైబై.. పెయింటెడ్‌ స్టార్క్స్‌

ABN , Publish Date - Jun 04 , 2026 | 05:08 AM

విదేశీ అతిథి పక్షులైన పెయింటెడ్‌ స్టార్క్స్‌ ఎన్టీఆర్‌ జిల్లాను వీడి వెళ్లడానికి సిద్ధమవుతున్నాయి. ఖండాంతరాలు దాటి ఆరు నెలలుగా ...

బైబై.. పెయింటెడ్‌ స్టార్క్స్‌

  • వెంకటాపురం నుంచి విదేశీ పక్షుల తిరుగు ప్రయాణం

పెనుగంచిప్రోలు రూరల్‌, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): విదేశీ అతిథి పక్షులైన పెయింటెడ్‌ స్టార్క్స్‌ ఎన్టీఆర్‌ జిల్లాను వీడి వెళ్లడానికి సిద్ధమవుతున్నాయి. ఖండాంతరాలు దాటి ఆరు నెలలుగా పెనుగంచిప్రోలు రూరల్‌ మండలం వెంకటాపురంలో ఇవి విడిది చేశాయి. అక్కడే సంతానాన్ని కని, పెంచి, పెద్ద చేసిన ఈ పక్షులు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నాయి. మరో వారం, పది రోజుల్లో ఇవన్నీ ఖండాంతరాలు దాటి వెళ్లిపోతాయి. మళ్లీ ఏడాది తర్వాత వెంకటాపురం వస్తాయి. ఆరు నెలలుగా విదేశీ పక్షులను తమ సొంత సంతానంలా వెంకటాపురం గ్రామస్తులు సంరక్షించారు. తమతో అనుబంధాన్ని పంచుకుని వెళ్లిపోతున్న పక్షులను బాధతో సాగనంపుతున్నారు.

Updated Date - Jun 04 , 2026 | 05:08 AM