సరిహద్దు ఉద్యోగులకు పోలింగ్ రోజు పెయిడ్ హాలిడే
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:42 AM
తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో ఉద్యోగులకు ప్రభుత్వం వేతనంతో...
అమరావతి, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో ఉద్యోగులకు ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ జి.సాయిప్రసాద్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 9న పుదుచ్చేరి సరిహద్దు జిల్లాలైన కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో, 23న తమిళనాడు సరిహద్దు జిల్లాలైన తిరుపతి, చిత్తూరులో పెయిడ్ హాలీడే ఇవ్వనున్నారు.