Share News

స్థానిక ఎన్నికల్లో రాజకీయ ప్రాధాన్యం కల్పించండి

ABN , Publish Date - Mar 09 , 2026 | 05:08 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తమ సామాజికవర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించి రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని పద్మశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీవీ నాగేశ్వరరావు కోరారు.

స్థానిక ఎన్నికల్లో రాజకీయ ప్రాధాన్యం కల్పించండి

  • ఏపీ పద్మశాలీ సంక్షేమ సంఘం

విజయవాడ (గవర్నర్‌పేట), మార్చి 8 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తమ సామాజికవర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించి రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని పద్మశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీవీ నాగేశ్వరరావు కోరారు. విజయవాడలోని ఎంబీవీకేలో ఆదివారం సంఘం రాష్ట్ర నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. అధ్యక్షుడిగా జీవీ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా అందె జగదీశ్‌, ఉపాధ్యక్షుడిగా బల్ల పరమేశ్వరరావు, మహిళా విభాగం అధ్యక్షురాలిగా జేరుబండి శ్యామల, చేనేత విభాగం ప్రతినిధిగా జక్కా చినసింగరయ్య, యువజన విభాగం అధ్యక్షుడిగా సప్పా మణికంఠతో పాటు మిగిలిన కమిటీ పాలకవర్గం సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయ ప్రాధాన్యం ద్వారానే సామాజిక వర్గాలు అన్ని రంగాల్లో ముందుకువెళ్లాయని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు పద్మశాలీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మశాలీ యువత విద్యలో రాణించడం ద్వారా సామాజికవర్గానికి అండగా నిలవాలని కోరారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ట స్వామి, ఉపాధ్యక్షుడు జింక రామాంజనేయులు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భీమనపల్లి వెంకట సుబ్బయ్య, అనుబంధ సంఘాల నేతలు కొప్పుల రమేశ్‌, వద్ది నరసింహులు, గడ్డం జగన్నాథం, కొంగతి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2026 | 05:08 AM