ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలిగా దుర్గ
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:29 AM
ఆంధ్రప్రదేశ్ సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలిగా పి.దుర్గ ఎన్నికయ్యారు.
అమరావతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలిగా పి.దుర్గ ఎన్నికయ్యారు. అమరావతి సచివాలయంలో సోమవారం జరిగిన ఎన్నికలో వైస్ ప్రెసిడెంట్, అడిషనల్ సెక్రటరీ జనరల్, ట్రెజరర్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన నాలుగు పదవులకు ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష స్థానానికి ముగ్గురు పోటీపడగా దుర్గ గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా సత్యవతి విజయం సాధించారు. ఉపాధ్యక్షురాలిగా సునీత (ఏకగ్రీవం), అదనపు సెక్రటరీగా (జనరల్) జె.సాయిలీల(ఏకగ్రీవం), అడిషనల్ సెక్రటరీ జనరల్ (కల్చర్)గా సత్యవేణి, జాయింట్ సెక్రటరీగా కవిత, ట్రెజరర్‌గా సౌజన్య(ఏకగ్రీవం) గెలుపొందారు.