Share News

తెలంగాణకు వెళ్లేందుకు సిద్ధం

ABN , Publish Date - Jun 20 , 2026 | 05:39 AM

ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర బదిలీపై ఏపీ సీఎస్‌ ఇటీవల తెలంగాణ సీఎస్‌కు లేఖ రాశారు. శాశ్వత ప్రాతిపదికన తెలంగాణకు వెళ్లడానికి ఆప్షన్‌ ఎంచుకున్న ఉద్యోగుల..

తెలంగాణకు వెళ్లేందుకు సిద్ధం

  • 891 మంది ఏపీ ఉద్యోగుల ఆప్షన్లు

అమరావతి, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర బదిలీపై ఏపీ సీఎస్‌ ఇటీవల తెలంగాణ సీఎస్‌కు లేఖ రాశారు. శాశ్వత ప్రాతిపదికన తెలంగాణకు వెళ్లడానికి ఆప్షన్‌ ఎంచుకున్న ఉద్యోగుల సమాచారాన్ని పేర్కొన్నారు. గతంలో ఈ ఆప్షన్‌ ఎంచుకున్న 1,943 మందిలో ప్రస్తుతం 891 మంది ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. తదుపరి చర్యల నిమిత్తం దీనిని పరిశీలించి తమ అభిప్రాయాన్ని, అంగీకారాన్ని తెలియజేయాలని ఏపీ సీఎస్‌ కోరారు.

Updated Date - Jun 20 , 2026 | 05:40 AM