అక్షరాంధ్ర పరీక్షకు 24.72 లక్షల మంది హాజరు
ABN , Publish Date - Mar 16 , 2026 | 05:58 AM
వంద శాతం అక్షరాస్యత సాధించడం లక్ష్యంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా వయోజనులకు నిర్వహించిన ‘అక్షరాంధ్ర ఫౌండేషనల్ లిటరసీ..
అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): వంద శాతం అక్షరాస్యత సాధించడం లక్ష్యంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా వయోజనులకు నిర్వహించిన ‘అక్షరాంధ్ర ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్‌మెంట్ పరీక్ష’కు 24,72,092 మంది హాజరయ్యారని వయోజన విద్యాశాఖ డైరెక్టర్ రంజిత్ బాషా ఓ ప్రకటనలో తెలిపారు. 34,406 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించామన్నారు. గుంటూరు, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో వంద శాతం హాజరు నమోదైందని పేర్కొన్నారు.