Share News

సభ గౌరవానికి చైర్మనే విఘాతం కలిగిస్తున్నారు!

ABN , Publish Date - Feb 28 , 2026 | 05:45 AM

చైర్మన్‌ మోషేన్‌రాజు శాసనమండలిలో పాల క పక్షాన్ని విమర్శించడం సరైంది కాదని కూటమి ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తంచేశారు.

సభ గౌరవానికి చైర్మనే విఘాతం కలిగిస్తున్నారు!

  • పయ్యావులపై వ్యాఖ్యలు బాధాకరం: కూటమి ఎమ్మెల్సీలు

అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): చైర్మన్‌ మోషేన్‌రాజు శాసనమండలిలో పాల క పక్షాన్ని విమర్శించడం సరైంది కాదని కూటమి ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం మీడియా పాయింట్‌లో మాట్లాడా రు. సభను సజావుగా నడిపించాలనే ప్రయ త్నం చైర్మన్‌ చేయడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు. లడ్డూ అంశంపై చర్చకు ప్రభుత్వం అంగీకరించినా.. చర్చ జరిగే సమయంలో దేవదాయ మంత్రి స్టేట్‌మెంట్‌ ఇవ్వడానికి చైర్మన్‌ అనుమతి ఇవ్వలేదని చెప్పారు. మంత్రి స్టేట్‌మెంట్‌కు అనుమతివ్వాలన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌పై చైర్మన్‌ వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమని తెలిపారు. సభ సంప్రదాయా న్ని కాపాడాల్సిన చైర్మన్‌.. సంప్రదాయాలకు విఘాతం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చైర్మన్‌ మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో తమకు అర్థం కాలేదని.. కానీ సభ్యుల మనోభావాలకు పూర్తి విఘాతం కలిగే పరిస్థితిని ఆయన కల్పించారన్నారు.

కొత్త శైలి: వీర్రాజు

‘ప్రభుత్వంపైనే చైర్మన్‌ ఆరోపణలు చేశా రు. గతంలో ఎప్పుడూ ఏ చైర్మన్‌ ఇలా చేయలేదు. కొత్త వ్యవహారశైలికి తెరలేపారు. తిరుమల లడ్డూపై చర్చకు మేం సిద్ధం’ అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు.

స్ర్కిప్టు ఎక్కడి ది: అనూరాధ

వైసీపీ సభ్యులతో కలిసిపోయి చైర్మన్‌ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండలి చీఫ్‌ విప్‌ పంచుమర్తి అనూరాధ విమర్శించారు. ‘అధికార పార్టీ సభ్యులే చర్చను అడ్డుకున్నారని చైర్మన్‌ చెప్పడం విడ్డూరం. ఇది నాటకంలా ఉంది.. ఈ స్ర్కిప్టు ఎక్కడి నుంచి వచ్చింది?’ అని ప్రశ్నించారు. కాగా, జగన్‌ రిమోట్‌ ద్వారా వైసీపీ సభ్యులను ఆడిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు విమర్శించారు. వారు చీప్‌ ట్రిక్స్‌ మానుకోవాలని.. పెద్దల సభను 5 కోట్ల మంది గమనిస్తున్నారని చెప్పారు. కుట్రతోనే బడ్జెట్‌ సమావేశాలను వైసీపీ ఎమ్మెల్సీలు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ విమర్శించారు.

Updated Date - Feb 28 , 2026 | 05:45 AM