కార్డియాక్ అరెస్టుతో ఓపీ రోగి మృతి
ABN , Publish Date - Apr 03 , 2026 | 10:38 PM
ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడకు చెందిన మహ్మద్ కాశీం (52) శుక్రవారం మధ్యాహ్నం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కార్డియాక్ అరెస్టుతో క్యాజువాల్టీలో మృతి చెందారు.
కర్నూలు హాస్పిటల్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడకు చెందిన మహ్మద్ కాశీం (52) శుక్రవారం మధ్యాహ్నం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కార్డియాక్ అరెస్టుతో క్యాజువాల్టీలో మృతి చెందారు. స్కిన ఓపీ(డీవీఎల్)కి ఉదయం వచ్చిన ఆయన అక్కడ వైద్యుల దగ్గర ఓపీ చూపించుకుని మధ్యాహ్నం 12గంటల సమయంలో మొదటి అంతస్తు నుంచి కిందకు వస్తూ మెట్లపైనే కింద పడ్డాడు. దీన్ని గమనించిన సెక్యూరిటీ గార్డు రోగిని క్యాజువాల్టీకి తరలించారు. ఎమర్జెన్సీ మెడిసిన ఇనచార్జి హెచ వోడీ డా.శారద నేతృత్వంలో రోగికి సీపీఆర్ షాక్ ఇచ్చిన బతికిం చేందుకు ప్రయత్నించినా ఫలితం కాలేదు, రోగి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సీవియర్ ఎంఐ రావడంతో రోగి మృతి చెం దాడనీ డా.శారద తెలిపారు. రోగి వెంట బందువులు ఎవరూ లేకపో వడంతో ఆధార్ కార్డులో ఉన్న నెంబర్‌కు అతని ఫోన ఉన్న నెంబర్లకు నర్సింగ్ సిబ్బంది ఫోనచేసి సమాచారమిచ్చారు.