ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ABN , Publish Date - Mar 27 , 2026 | 05:17 AM
ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి శాస్ర్తోకంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం ఆరు గంటలకు వేదమంత్రోచ్ఛారణల నడుమ అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
నేడు ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
ఒంటిమిట్ట, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి శాస్ర్తోకంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం ఆరు గంటలకు వేదమంత్రోచ్ఛారణల నడుమ అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విష్వక్సేనపూజ, కలశ ప్రతిష్ఠ చేశారు. అనంతరం పుట్టమన్ను సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం పోతన జయంతి వేడుకలు నిర్వహించనున్నారు.
