Share News

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

ABN , Publish Date - Mar 26 , 2026 | 03:52 AM

ఒంటిమిట్టలోని కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

ఒంటిమిట్ట, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఒంటిమిట్టలోని కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఏప్రిల్‌ 1న జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆలయంలో హరిద్ర ఘటనం (పసుపు దంచే) కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ముందు తొలి ఆచారంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. మహిళలు, భక్తులు, శ్రీవారి సేవకులు, టీటీడీ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పసుపును స్వామివారికి నిర్వహించే స్నపన తిరుమంజన కార్యక్రమంలోను, కల్యాణోత్సవానికి అవసరమైన తలంబ్రాలను సిద్ధం చేయడానికి ఉపయోగిస్తారు.

Updated Date - Mar 26 , 2026 | 03:52 AM