Share News

అంతంత మాత్రమే

ABN , Publish Date - Oct 22 , 2026 | 12:09 AM

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణలో భాగంగా, మొదటి రోజు బుధవారం ఎంపీటీసీల నామినేషన్ల ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమైంది.

   అంతంత మాత్రమే
ఎంపీటీసీకి నామినేషన వేస్తున్న తుగ్గలి నాగేంద్ర సతీమణి వరలక్ష్మి

ఆదోనిలో తొలిరోజు మూడు నామినేషన్లు

డ్రోన కెమెరాలతో నిఘా....

నేడు భారీగా పెరిగే అవకాశం

ఆదోని రూరల్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణలో భాగంగా, మొదటి రోజు బుధవారం ఎంపీటీసీల నామినేషన్ల ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదోని-1,2 మండలాలకు నామినేషన్లు వేసే వారికోసం మండల కార్యాలయంలో రెండు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా నామినేషన్లు వేసే అభ్యర్థుల సమస్యల పరిష్కారం కోసం హెల్ప్‌ డెస్క్‌లను కూడా ఏర్పాటు చేశారు. ఆదోని-1 మండలంలో గోనబావి, సాదాపురం ఉమ్మడి ఎంసీటీసీకి సాదాపురం గ్రామానికి చెందిన నామాల హేమలత, సంధ్య, విరూపాపురం ఎంపీటీసీకి ఎల్‌.వీరేంద్రలు టీడీపీ తరఫున నామినేషన దాఖలు చేశారు. ఆదోని-2కు నామినేషన్లు దాఖలు కాలేదు. ముఖ్యంగా నేడు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని రిటర్నింగ్‌ అధికారి పద్మనాభరెడ్డి, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి నాగరాజుస్వామి తెలిపారు. ఏఎస్పీ జయశర్మ ఆధ్వర్యంలో సీఐలు నల్లప్ప, రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐలు రామాంజనేయులు, మహేష్‌ కుమార్‌, రామ్‌నాథ్‌, సిబ్బంది భీమాస్‌ సర్కిల్‌ నుంచి స్టేట్‌ బ్యాంకు మీదుగా ఎంపీడీవో కార్యాలయం వరకు బందోబస్తు నిర్వహించారు. అల్లర్లకు పాల్పడే వారిని ముందుగానే గుర్తించడానికి డ్రోన కెమెరాలతో నిఘా ఉంచారు.

మద్దికెర: మద్దికెర మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. బుధవారం మొదటి రోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. మద్దికెర గ్రామంలోని 1వ ఎంపీటీసీకి టీడీపీ బలపరిచిన ఎర్రవలి లక్ష్మిదేవి, రెండో ఎంపీటీసీకి గడ్డం రామాంజులు, హంపా ఎంపీటీసీకి రంగమ్మలు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మోహన విజయకుమార్‌కు నామినేషన పత్రాలు సమర్పించి నామినేషన్లు వేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో కేవీ నాగేంద్ర ప్రసాద్‌, తహసీల్దార్‌ గూండాల్‌ నాయక్‌ , ఎస్‌ఐ నరేష్‌ పాల్గొన్నారు.

టీడీపీ మద్దికెర జడ్పీటీసీ అభ్యర్థిగా..

తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా మద్దికెర శ్రీవిద్యాసాయి పాఠశాల ప్రిన్సిపాల్‌ బాల సునీత యాదవ్‌ను, ఎంపీపీ అభ్యర్థిగా బురుజుల గ్రామానికి చెందిన రాజేశ్వరిని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రకటించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా మాజీ కార్యదర్శి గూడూరు ధనుంజయుడు, యజ్ఞం వెంకట మాదవ, సొసైటీ చైర్మన ఎర్రిస్వామి, కొత్తూరు శ్రీనివాసులు, మోహన తదితరులు పాల్గొన్నారు.

దేవనకొండ: మండలంలోని 20 ఎంపీటీసీ స్థానాలకు మొదటిరోజు టీడీపీ 1, జనసేన 1, సీపీఎం 1, వైసీపీ 16 మంది అభ్యర్ధులు, మొత్తం 19 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్ల కేంద్రాన్ని సచివాలయాల జిల్లా అధికారి భాస్కర్‌నాయుడు పరిశీలించారు.

హొళగుంద: మండలంలో నామినేషన్ల ప్రక్రి య మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. బుధవారం మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు గానూ మొత్తం 18 నామినేషన్లు నమోదైనట్లు ఎన్నికల అధికారి మనోహర్‌ తెలిపారు. మొదటిరోజు టీడీపీ-15, వైసీపీ- 1, జనసేన- 1, ఇండిపెండెంట్‌-1 నామినేషన్లు వేశారు. ఎస్‌ఐ దిలీ్‌పకుమా ర్‌ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

హాలహర్వి: మండలంలో తొలిరోజున ప్రశాంతంగా ఐదు మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. టీడీపీ తరపున మూడు, బీఎస్పీ తరపున ఒకరు, వైసీపీ తరపున ఒకరు నామినేషన్లు వేశారన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ పార్థసారథి, ఎస్‌ఐ ఈశ్వరరావు బందోబస్తు నిర్వహించారు.

వెల్దుర్తి: వెల్దుర్తి మండల ప్రజాపరిషత కార్యాలయంలో బుధవారం ఎంపీటీసీల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రిటర్నింగ్‌ అధికారి నాయకంటి శ్రీదేవి, ఏఆర్‌ఓలు చంద్రశేఖర్‌రెడ్డి, గురుస్వామి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. మొదటిరోజు 11 నామినషన్లు దాఖలయ్యాయి. చెరుకులపాడు-1, ఎస్‌.బోయినపల్లి-3, వెల్దుర్తి(2)-2, మల్లెపల్లి-1, వెల్దుర్తి(1)-1, సూదేపల్లి-1, వెల్దుర్తి(4)-1, వెల్దుర్తి(3)-1. మొదటిరోజు టీడీపీ పార్టీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. సీఐ యుగంధర్‌, ఎస్‌ఐ నరేశ శాంతి భద్రతలను పర్యవేక్షించారు.

తుగ్గలి: మండలంలో నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. తుగ్గలి ఎంపీటీసీ అభ్యర్థిగా ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన తుగ్గలి నాగేంద్ర సతీమణి వరలక్ష్మి నామినేషన వేశారు. అలాగే ఆమె కూతురు కూడా నామినేషన వేశారు. టీడీపీ అభ్యర్థులు దాదాపు 7 ఎంపీటీసీ స్థానాలకు 11 నామినేషన్లు వేశారు. అలాగే వైసీపీ 6 ఎంపీటీసీ స్థానాలకు 9 నామినేషన్లు దాఖలు వేశారు. రాతన నుంచి ఒకరు ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన వేశారు.

పత్తికొండ: మండలంలో మొదటిరోజు ఒక్క నామినేషన కూడా దాఖలు కాలేదని మండల రిటర్నింగ్‌ అధికారి శివరుద్రకుమార్‌ తెలిపారు. కాగా, నామినేషన కేంద్రాన్ని ఆర్డీవో ఓబులేసు పరిశీలించారు. ఎన్నికల నియమావళిని అనుసరిం చి అభ్యర్థులు నడుచుకోవాలన్నారు.

క్రిష్ణగిరి: మండలంలో క్రిష్ణగిరి నుంచి 2, తోగర్చేడు నుంచి 2, అమకతాడు నుంచి తెలుగు దేశం అభ్యర్థిగా గుమ్మకొండ వెంకటేష్‌ నామినేషన వేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉప్పర కార్పొరేషన డైరెక్టర్‌ ఎల్వీ ప్రసాద్‌, టీడీపీ మండల అధ్యక్షుడు దామోదర్‌ నాయుడు, నాయకులు మర్రి శ్రీరాములు, గురుస్వామి పాల్గొన్నారు.

ఆలూరు: ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకు గాను వైసీపీ 14 మంది నామినేషన్లు వేశారు. టీడీపీ నుంచి హులేబీడు గ్రామం నుంచి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా జ్యోతి నామినేషన్‌ వేశారు. ఆలూరు 2వ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా అనిల్‌కుమార్‌ నామినేషన్‌ వేసినట్లు ఎన్నికల అధికారి ఆనందరాజు తెలిపారు. ఏఎస్పీ హుసేన్‌ బందో బస్తు ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే నామి నేషన్‌ ప్రక్రియను పత్తికొండ ఆర్డీవో ఓబులేసు పరిశీలించారు.

ఆస్పరి: మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలు ఉండగా బుధవారం ఆయా గ్రామాల నుంచి ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు 16 మంది వైసీపీ అభ్యర్థులు ఆయా గ్రామాల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు.

Updated Date - Oct 22 , 2026 | 12:09 AM