Srisailam Temple EO Srinivasa Rao: శివసేవకులకు ఆన్‌లైన్‌లో అవకాశం
ABN , Publish Date - Jan 06 , 2026 | 06:03 AM
శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు స్వచ్ఛందంగా సేవలు అందించే శివసేవకులు ఇకపై ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్టు ఆలయ ఈఓ శ్రీనివాసరావు వెల్లడించారు.
శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు
శ్రీశైలం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు స్వచ్ఛందంగా సేవలు అందించే శివసేవకులు ఇకపై ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్టు ఆలయ ఈఓ శ్రీనివాసరావు వెల్లడించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల సేవకులే కాకుండా దేశం నలుమూలల నుంచి శివభక్తులు చేసిన వినతులను పరిశీలించి దేవదాయశాఖ ఈ అవకాశం కల్పించిందన్నారు. దేవస్థానం పరిపాలనా భవనంలో సోమవారం అధికారులతో ఈవో సమావేశమై... ఆన్‌లైన్‌లో సేవకుల నమోదు, విధివిధానాల అమలుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శివసేవకుల నిబంధనలు, దరఖాస్తు విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు పాకెట్‌సైజు పుస్తకాన్ని అందించడంతోపాటు.. క్షేత్రంలో కూడా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ఈవో తెలిపారు. దేవస్థానం రూపొందించిన గుర్తింపు కార్డుతోపాటు, అధికారిక చిహ్నంగల స్కార్ఫ్‌ను అందించనున్నట్టు వివరించారు.