ఆన్‌లైన్‌లో చికిత్స వివరాలు: సౌరబ్ గౌర్
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:42 AM
రోగుల చికిత్స వివరాలు ఆన్‌లైన్‌లో ఉంటే భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ పేర్కొన్నారు.
అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): రోగుల చికిత్స వివరాలు ఆన్‌లైన్‌లో ఉంటే భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ పేర్కొన్నారు. సోమవారం డీఎంఈ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. బోధనాస్పత్రుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధనాస్పత్రుల్లో వైద్య సేవలు మరింత మెరుగుపడాలన్నారు. వైద్యుల రోజువారీ వ్యక్తిగత పనితీరుకు సంబంధించిన పూర్తి వివరాలు రోగుల ఎలకా్ట్రనిక్ హెల్త్ రికార్డుల యాప్‌లో కనిపించేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తే పర్యవేక్షణ అధికారుల నుంచి చర్యలుంటాయన్నారు. త్వరలో వాట్సాప్ గవర్నెన్ ్స ద్వారా వైద్యుల వద్దకు వెళ్లే ముందుగానే అపాయింట్మెంట్ తీసుకునే అవకాశాన్ని కల్పించాలని నిర్దేశించారు.