Share News

ప్రాణం తీసిన ఈత సరదా.. కుంటలో మునిగి నలుగురు పిల్లలు మృతి

ABN , Publish Date - Jun 05 , 2026 | 05:17 AM

ఈత సరదా నలుగురు చిన్నారుల ప్రాణాలు తీసింది. ఒంగోలు నగర కార్పొరేషన్‌ పరిధిలోని చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన కరేటి ...

ప్రాణం తీసిన ఈత సరదా.. కుంటలో మునిగి నలుగురు పిల్లలు మృతి

ఒంగోలు క్రైం,జూన్‌4 (ఆంధ్రజ్యోతి): ఈత సరదా నలుగురు చిన్నారుల ప్రాణాలు తీసింది. ఒంగోలు నగర కార్పొరేషన్‌ పరిధిలోని చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన కరేటి అభిరామ్‌(14), కరేటి సుశాంత్‌(12), పొదిలి చిన్ను అలియాస్‌ ఈశ్వర్‌ అభిరామ్‌ (11), ఇండ్లా దినేష్‌(10) వేసవి సెలవులు కావడంతో ఈత కాయలు కోసమని శుక్రవారం పొలానికి వెళ్లారు. ఉదయం వెళ్లిన నలుగురూ మధ్యాహ్నం కూడా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో పిల్లల తల్లిదండ్రులు వారి కోసం వెతుకుతుండగా కందులూరు వెళ్లే డొంకలో ఉన్న కుంటకు ఈతకు వెళ్లారని స్థానికులు చెప్పారు. ఈ క్రమంలో గ్రామ సమీపంలో గ్రావెల్‌ కోసం తవ్విన కుంట వద్దకు వెళ్లగా గట్టుపైన పిల్లల దుస్తులు, చెప్పులు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు కుంటలో గాలింపు చర్యలు చేపట్టి చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. కాగా, మృతుల్లో అభిరామ్‌, సుశాంత్‌ అన్నదమ్ములు.

Updated Date - Jun 05 , 2026 | 05:17 AM