Share News

100 కోట్లతో రాడిసన్‌ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌

ABN , Publish Date - Aug 29 , 2026 | 05:45 AM

ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధికి ఊతం ఇచ్చే మరో అడుగు ముందుకు పడింది. రూ.100 కోట్ల వ్యయంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న రాడిసన్‌ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నిర్మాణానికి..

100 కోట్లతో రాడిసన్‌ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌

  • ఒంగోలులో 151 గదులతో నిర్మాణం

  • భూమిపూజ చేసిన మంత్రి లోకేశ్‌

  • 402 కోట్ల తాగునీటి స్కీమ్‌కు ప్రారంభం

ఇంటర్నెట్ డెస్క్: ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధికి ఊతం ఇచ్చే మరో అడుగు ముందుకు పడింది. రూ.100 కోట్ల వ్యయంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న రాడిసన్‌ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నిర్మాణానికి ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని చదలవాడ వద్ద బీజం పడింది. రవిశంకర్‌ గ్రూప్‌, రాడిసన్‌ సంయుక్తంగా తలపెట్టిన ఈ హోటల్‌ నిర్మాణానికి మంత్రి లోకేశ్‌ శుక్రవారం ఉదయం భూమిపూజ చేశారు. అనంతరం.. ఒంగోలు మునిసిపాలిటీ ఏర్పడి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నగర ఉత్తర బైపాస్‌ జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన ఒంగోలు గిత్త విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ ప్రాంతానికి చెందిన 20 మంది ప్రముఖుల విగ్రహాలను కూడా ఆవిష్కరించారు. తాగునీటి సమస్యను తీర్చేందుకు అమృత్‌ 2.0 కింద రూ.424 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకం పనుల ప్రారంభ సూచికంగా ఏర్పాటుచేసిన పైలాన్‌ను రంగారాయడు చెరువు వద్ద ఆవిష్కరించారు.

Updated Date - Aug 29 , 2026 | 05:46 AM