Share News

ఒంగోలు మున్సిపాలిటీకి 150 ఏళ్లు

ABN , Publish Date - Sep 28 , 2026 | 05:34 AM

ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా.. ఆదివారం చేపట్టిన ‘హెరిటేజ్‌ వాక్‌’ కోలాహలంగా సాగింది. విద్యార్థులు, యువకులు, రాజకీయ, ఇతర వర్గాల ప్రముఖులు వేలాది మంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఒంగోలు మున్సిపాలిటీకి 150 ఏళ్లు
ONGOLE

  • 30న శతాబ్దిన్నర వేడుకలు

ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా.. ఆదివారం చేపట్టిన ‘హెరిటేజ్‌ వాక్‌’ కోలాహలంగా సాగింది. విద్యార్థులు, యువకులు, రాజకీయ, ఇతర వర్గాల ప్రముఖులు వేలాది మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. మంగమూరు రోడ్డు బైపాస్‌ జంక్షన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు సుమారు 3 కి.మీ. మేర ఈ వాక్‌ సాగింది. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, బీఎన్‌ విజయ్‌కుమార్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 150 వసంతాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 30న నగరంలో శతాబ్దిన్నర వేడుకలు నిర్వహించనున్నారు. - ఒంగోలు, ఆంధ్రజ్యోతి

Updated Date - Sep 28 , 2026 | 05:36 AM