లిఫ్టు ప్రమాదంలో మహిళ మృతి
ABN , Publish Date - Aug 20 , 2026 | 03:38 AM
అపార్ట్‌మెంట్‌లోని లిప్టు ప్రమాదంలో వినీత(55) అనే మహిళ మృతిచెందారు. ఈ ఘటన ఈనెల 16న ఒంగోలులోని పాత మార్కెట్ సమీపంలోని..
ఒంగోలు క్రైం, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): అపార్ట్‌మెంట్‌లోని లిప్టు ప్రమాదంలో వినీత(55) అనే మహిళ మృతిచెందారు. ఈ ఘటన ఈనెల 16న ఒంగోలులోని పాత మార్కెట్ సమీపంలోని సూర్య అపార్ట్‌మెంట్‌లో జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. వినీత, ఆమె కుమార్తె, మనవడు లిఫ్టులో తమ ఫ్లోర్‌లోకి రాగానే కుమార్తె, మనవడు బయటకు వచ్చారు. వారి వెనుక వినీత బయటకు వస్తుండగా ఒక్కసారిగా గేట్లు వేయకుండానే లిఫ్టు కిందకు దిగిపోవడంతో ఆమె మధ్యలో ఇరుక్కుపోయి నరక యాతన అనుభవించారు. తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, అపార్ట్‌మెంట్‌వాసులు అక్కడకు చేరుకుని ఆమెను బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు మృతిచెందారు.