గుండెపోటుతో డీఎస్పీ శ్రీరామ్ హఠాన్మరణం
ABN , Publish Date - Jun 12 , 2026 | 04:17 AM
ఒంగోలు జోన్ ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేస్తున్న వేలమూరి శ్రీరామ్(55) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. బుధవారం అర్ధరాత్రి ఒంగోలులోని స్వగృహంలో...
ఒంగోలు జోన్ ఇంటెలిజెన్స్‌లో విధులు
ఒంగోలు క్రైం, జూన్ 11(ఆంధ్రజ్యోతి): ఒంగోలు జోన్ ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేస్తున్న వేలమూరి శ్రీరామ్(55) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. బుధవారం అర్ధరాత్రి ఒంగోలులోని స్వగృహంలో ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో వైద్యశాలకు తరలించారు. అక్కడ డాక్టర్లు సీపీఆర్ చేసిన తర్వాత కోలుకున్నారు. అయితే కొద్దిసేపటికి మరోసారి నొప్పి రావడంతో రాత్రి 1.30 గంటల తర్వాత మృతిచెందారు. నెల్లూరు జిల్లా సోమశిలకు చెందిన శ్రీరాం ప్రకాశం జిల్లాలో వివిధ స్టేషన్లలో పనిచేశారు. ఆయనకు భార్య కాంచన, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు నెలల క్రితం పదోన్నతి పొంది ఇంటెలిజెన్స్ ఒంగోలు జోన్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. శ్రీరామ్ మృతదేహాన్ని పలువురు నేతలు, పోలీసు అధికారులు సందర్శించి, నివాళులర్పించారు.