సీఎంను కలిసిన ఓఎన్‌జీసీ చైర్మన్
ABN , Publish Date - Jun 04 , 2026 | 05:00 AM
ఓఎన్‌జీసీ చైర్మన్ అరుణ్‌కుమార్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో ...
అమరావతి, జూన్ 3(ఆంధ్రజ్యోతి): ఓఎన్‌జీసీ చైర్మన్ అరుణ్‌కుమార్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో వీరు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఓఎన్‌జీసీ చేపడుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యకలాపాలను ఆయన సీఎంకు వివరించారు. కృష్ణా-గోదావరి డెల్టా బేసిన్‌లో సహజవాయువు, చమురు అన్వేషణ, వెలికితీత పనుల పురోగతి సహా వివిధ అంశాలను సీఎం దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ఇంధన రంగం అభివృద్ధికి ఓఎన్‌జీసీ చేస్తున్న కృషిని సీఎం అభినందించారు. ఓఎన్‌జీసీ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి సమకూరే ఆదాయం, ఉపాధి అవకాశాలు, స్థానిక ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావంపైనా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం-ఓఎన్‌జీసీ మధ్య సరైన సమన్వయం ఉండేలా చూడాలని, తద్వారా ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలని ఆయనకు సీఎం సూచించారు. ఇంధన భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుందని స్పష్టం చేశారు. సామాజిక బాధ్యతగా సీఎ్‌సఆర్ నిధులను ఆయా గ్రామాల్లో ఖర్చు పెట్టాలని కోరారు. చమురు సహజ వాయువు నిక్షేపాలను తీస్తున్న సమీప ప్రాంతాల అభివృద్ధికి ఓఎన్‌జీసీ కృషి చేయాలని .. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి, ఆ శాఖ ప్రత్యేక సీఎస్ ఎంటీ కృష్ణబాబు పాల్గొన్నారు.