Share News

రాష్ట్ర పెట్టుబడుల్లో మూడోవంతు సీమకే

ABN , Publish Date - Jun 30 , 2026 | 06:29 AM

కూటమి ప్రభుత్వ హయాంలో రాయలసీమ రతనాల సీమగా మారుతోందని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

రాష్ట్ర పెట్టుబడుల్లో మూడోవంతు సీమకే

  • మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ హయాంలో రాయలసీమ రతనాల సీమగా మారుతోందని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘కూటమి హయాంలో రాయలసీమ పారిశ్రామిక, ఉద్యానవన హబ్‌గా రూపొందుతోంది. రాష్ట్ర పెట్టుబడుల్లో మూడోవంతు రాయలసీమకే వస్తున్నాయి. తిరుపతిలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తయారీ యూనిట్‌, పుట్టపర్తిలో డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో ఏఎంసీఏ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు శరవేగంగా ముందుకు కదులుతున్నాయి. సత్యసాయి జిల్లాలో రిలయన్స్‌ ఆధ్వర్యంలో రూ.51 వేల కోట్లతో సోలార్‌ పవర్‌, బ్యాటరీ స్టోరేజ్‌ ప్రాజెక్టు, కడప జిల్లాలో అదానీ ఆధ్వర్యంలో రూ.12 వేల కోట్లతో హైడ్రో ఎనర్జీ ప్రాజెక్టు, కర్నూలు జిల్లాలో డ్రోన్‌ సిటీ, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో స్పేస్‌ సిటీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. ఓర్వకల్లులో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా సాగుతోంది. సీమలోని సాగునీటి ప్రాజెక్టులనూ కూటమి ప్రభుత్వం శరవేగంగా పూర్తిచేస్తోంది. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో సీమను ఉద్యానవన కేంద్రంగా చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది’ అని మంత్రి అన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 06:29 AM