Share News

వాల్మీకిని ఆదర్శంగా తీసుకోవాలి

ABN , Publish Date - Oct 27 , 2026 | 12:07 AM

వాల్మీకి మహర్షి అందించిన దివ్యసందేశా లను, ఆశయాలను సమాజంలోని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ పిలుపునిచ్చారు.

వాల్మీకిని ఆదర్శంగా తీసుకోవాలి
వాల్మీకి విగ్రహానికి నివాళి అర్పించిన టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, వాల్మీకి సోదరులు

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు

గుడిసె కృష్ణమ్మ

మేదరిగేరిలో వాల్మీకి బోర్డు వద్ద,

వాల్మీకి నగర్‌ దేవాలయంలో పూజలు

ఆదోని, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): వాల్మీకి మహర్షి అందించిన దివ్యసందేశా లను, ఆశయాలను సమాజంలోని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ పిలుపునిచ్చారు. వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పట్టణంలోని మేదరిగేరిలో ఏర్పాటు చేసిన వాల్మీకి బోర్డు వద్ద కృష్ణమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాల్మీకి నగర్‌లోని వాల్మీకి ఆలయాన్ని సం దర్శించి ప్రత్యేక అర్చనలు చేపట్టి, మహర్షికి భక్తిశ్రద్ధలతో నివాళులు అర్పించా రు.

ఆలూరు: మహర్షి వాల్మీకి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి అన్నారు. సోమవారం పట్టణంలోని పాత బస్టాండు వద్ద మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వాల్మీకి సంఘం నాయకులు మాదన్న, మరకట్టు ఎల్లప్ప, గుండన్న, డాక్టర్‌ నెట్టప్ప, ముద్దురంగ, టీడీపీ నాయకులు వైకుంఠం శ్రీరామ్‌, కొమ్ము రామాంజినేయులు, కప్పట్రాళ్ల మల్లికార్జున, శివ పాల్గొన్నారు.

దేవనకొండ: వాల్మీకి బాటలో పయ నించాలని రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన చైర్‌పర్సన కప్పట్రాళ్ల బొజ్జమ్మ అన్నారు. మండలంలో కప్పట్రాళ్లలో వాల్మీకి ప్రతిమకు పూలమాల వేసి స్మరించుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామచంద్రనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

ఆదోని రూరల్‌ : వాల్మీకులంతా ఐక్యతతో ఉండాలని ఎమ్మెల్యే పార్థసారథి కోరారు. సో మవారం ఆదోని-2 మం డలం పెద్దహరివాణంలో జరిగిన వాల్మీకి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాల్మీకులు విద్యా, ఉద్యోగ, రాజకీయ, సామాజికంగా, ఆర్థికం గా ఎదగాలని ఆకాంక్షించారు.

చిప్పగిరి: చిప్పగిరిలోని వాల్మీకి విగ్రహానికి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అలాగే ఆయా గ్రామాల్లో నాయకులు నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున, ఓబులేసు, సర్వర్‌ఖాన్‌, శ్రీరాములు, పెద్ద పెద్దయ్య, ఆటో మహానంది, చెరువు తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. అలాగే హొళగుంద, మద్దికెర, తుగ్గలి, కృష్ణగిరి, వెల్దుర్తి, పత్తికొండ, హాలహర్వి, చిప్పగిరి, ఆస్పరి మండలాల్లో స్థానిక నాయకులు వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి, చిత్రపటాలకు నివాళి అర్పించారు.

Updated Date - Oct 27 , 2026 | 12:07 AM