Share News

సొంతూరికి సేవ చేయాలి

ABN , Publish Date - Mar 18 , 2026 | 11:46 PM

సొంత ఊరికి సేవ చేయాలన్న తపన ప్రతి ఒక్కరిలో ఉండాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత పిలుపునిచ్చారు.

సొంతూరికి సేవ చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి టీజీ భరత

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత

కర్నూలు అర్బన్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): సొంత ఊరికి సేవ చేయాలన్న తపన ప్రతి ఒక్కరిలో ఉండాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని బుధవారపేట రోడ్డులో ఉన్న ఎంఎస్‌ ఫంక్షన హాలులో రాయలసీమ ఫౌండేషన ఆధ్వర్యంలో విద్యార్థినులకు స్కాలర్‌ షిప్స్‌, మహిళలకు ఉగాది, రంజాన రేషన కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత మాట్లాడుతూ రాయలసీమ ఫౌండేషన ద్వారా పదేళ్లుగా సేవా కార్యక్రమాలు కొనసాగించడం హర్షనీయమన్నారు. ఈ ఏడాది 50 మంది ప్రతిభ కలిగిన విద్యార్థులకు రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పున ప్రోత్సాహకాలు ఇచ్చారన్నారు. అమెరికాలో ఉంటూ కర్నూలు ప్రజలకు సేవ చేస్తున్న ఫహాద్‌ను అభినందించారు. కర్నూలు నగరంలో మసీదుల అభివృద్ధికి తన సహకారం ఎల్లవేలలా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షుడు నిరంజన, ఏపీఐఐసీ డైరెక్టర్‌ జగదీష్‌ గుప్త, సంజీవలక్ష్మి, బొందిలి కార్పొరేషన చైర్మన విక్రమ్‌ సింగ్‌, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత, నగర అధ్యక్షులు కె.రవికుమార్‌, కార్పొరేటర్లు పరమేష్‌, పద్మలతారెడ్డి, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అబ్బాస్‌, శేషగిరి శెట్టి, నౌషాద్‌, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2026 | 11:46 PM