విద్యార్థి దశ నుంచే దేశభక్తి అలవర్చుకోవాలి
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:17 AM
విద్యార్థి దశ నుంచే దేశభక్తి, క్రమశిక్షణ అలవర్చుకోవాలని సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి ఏవీఎస్ శ్రీవల్లి సూచించారు.
జూనియర్ సివిల్ న్యాయాధికారి ఏవీఎస్ శ్రీవల్లి
ఘనంగా కార్గిల్ విజయ్ దినోత్సవం
ఆదోని, జూలై 25 (ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశ నుంచే దేశభక్తి, క్రమశిక్షణ అలవర్చుకోవాలని సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి ఏవీఎస్ శ్రీవల్లి సూచించారు. శనివారం పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో కార్గిల్ విజయ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా న్యాయాధికారి ఏవీఎస్ శ్రీవల్లి పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎందరో మహానుభావులు, త్యాగమూర్తుల ఫలితంగానే నేడు మనం ప్రశాంత వాతావరణంలో, సుఖ శాంతులతో జీవిస్తున్నామన్నారు. తోటివారి పట్ల సత్ప్రవర్తనతో మెలగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత అనుభవాలను విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. అలాగే న్యాయవాది లోకే్‌షకుమార్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కజేయకుండా పోరాడిన త్యాగధనులను ప్రతిఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ఎన్‌సీసీ ఫస్ట్ ఆఫీసర్ అనిల్‌కుమార్ కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన త్యాగమూర్తుల పేర్లను, వారి వీరోచిత సాహసాలను వివరించారు. దేశ రక్షణలో సైనికుల పాత్ర ఎంత కీలకమో తెలియజేశారు. సమావేశంలో ఇన్‌చార్జి హెచ్‌ఎం ప్రసాద్, సీటీవో సురే్‌షకుమార్, ఉపాధ్యాయులు, ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.