రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ABN , Publish Date - Mar 06 , 2026 | 11:17 PM
పత్తికొండ బైపాస్ రోడ్డులో గురువారం అర్ధరాత్రి రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందారు.
మరొకరికి తీవ్రగాయాలు
ఢీకొన్న రెండు బైకులు
పత్తికొండ, మార్చి 6 (ఆంరఽధజ్యోతి): పత్తికొండ బైపాస్ రోడ్డులో గురువారం అర్ధరాత్రి రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తుగ్గలి మండలం బొల్లవానిపల్లెకు చెందిన పురుషోత్తంరెడ్డి (62) 4ఏళ్లుగా పత్తికొండ మండలం హోసూరులో ఉంటున్నాడు. గురువారం రాత్రి బైక్‌పై హోసూరుకు వెళుతుండగా ప్రభాస్ అనే యువకుడు పెట్రోల్ బంక్‌లో విధులు ముగించుకుని స్వగ్రామం రామచంద్రాపురానికి బయల్దేరాడు. వీరిద్దరి వాహనాలు చౌరస్తాలో ఢీకొనడంతో పురుషోత్తంరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రభాస్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆయనను పత్తికొండ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జయన్న తెలిపారు.