Share News

కౌంటింగ్‌ రోజు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Oct 24 , 2026 | 11:29 PM

కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియలో విధులు నిర్వహించే సిబ్బంది పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల నిబంధనలను పక్కాగా పాటించాలని అడిషనల్‌ ఎలక్షన అథారిటీ, నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు స్పష్టం చేశారు.

   కౌంటింగ్‌ రోజు అప్రమత్తంగా ఉండాలి
సిబ్బందికి సూచనలిస్తున్న అడిషనల్‌ ఎలక్షన అఽథారిటీ, నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు

- అడిషనల్‌ ఎలక్షన అథారిటీ, కమిషనర్‌ చల్లా ఓబులేసు

- ఆర్వోలు, ఏఆర్వోలకు పోలింగ్‌, ఓట్ల లెక్కింపు ప్రక్రియలపై అవగాహన

కర్నూలు కల్చరల్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియలో విధులు నిర్వహించే సిబ్బంది పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల నిబంధనలను పక్కాగా పాటించాలని అడిషనల్‌ ఎలక్షన అథారిటీ, నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు స్పష్టం చేశారు. శనివారం స్థానిక ఎస్‌బీఐ కాలనీలోని నగరపాలక సంస్థ సమావేశ భవనంలో కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు మున్సిపాలిటీల రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులకు పోలింగ్‌, ఓట్ల లెక్కింపు ప్రక్రియలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ట్రైనింగ్‌ నోడల్‌ అధికారి, డ్వామా పీడీ ఐ. నరసింహారెడ్డి, మేయర్‌ స్థాన రిటర్నింగ్‌ అధికారి, సెట్కూరు సీఈఓ డాక్టర్‌ కే వేణుగోపాల్‌తో కలిసి చల్లా ఓబులేసు బ్యాలెట్‌ బాక్స్‌ నిర్వహణపై ప్రాయోజిత ప్రదర్శన నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చల్లా ఓబులేసు మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు రోజున విధుల్లో ఎటువంటి అలసత్వానికి తావివ్వకూడదని, లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి దశలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్‌ రోజున విధులకు కేటాయించిన సిబ్బంది నిర్ణీత సమయానికి ముందుగానే చేరుకోవాలని, అభ్యర్థుల ఏజెంట్లు సైతం ముందుగానే హాజరయ్యేలా చొరవ తీసుకోవాలని తెలిపారు. బ్యాలెట్‌ బాక్సుల సీల్స్‌ను పరిశీలించిన తర్వాతే నిబంధనల ప్రకారం వాటిని తెరవాలని, బ్యాలెట్‌ పత్రాల సంఖ్యను సంబంధిత రికార్డుల్లో సరిచూసుకోవాలని సూచించారు. బ్యాలెట్‌ పత్రాల లెక్కింపులో భాగంగా మొదటగా వాటిని కట్టలుగా విభజించి, అనంతరం నిబంధనల ప్రకారం కలిపి అభ్యర్థుల వారీగా ఓట్లను వర్గీకరించి లెక్కించ వలసి ఉంటుందని వివరించారు. ప్రతి 25 బ్యాలెట్‌ పత్రాలతో ఒక కట్టను ఏర్పాటు చేసి, 1,000 బ్యాలెట్‌ పత్రాలను ఒక లెక్కింపు టేబుల్‌కు కేటాయించే విధానంపై అవగాహన కల్పించారు. చెల్లిన, చెల్లని ఓట్లను గుర్తించే సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సందేహాస్పద బ్యాలెట్‌ పత్రాల విషయంలో నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రతి రౌండ్‌లో లెక్కించిన ఓట్ల వివరాలను సక్రమంగా నమోదు చేసి, సంబంధిత రికార్డులను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పారదర్శకత, కచ్చితత్వం అత్యంత ముఖ్యమని, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కమిషనర్‌ సూచించారు.

Updated Date - Oct 24 , 2026 | 11:30 PM